Search for Inner Power | What Inspires Me

Search for Inner Power

No Comments

బ్రహ్మ మనిషిని తయారు చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందుచూపు, ఆత్మ విశ్వాసం నూరి నూరి నింపాడు.
ఆ తరువాత బ్రహ్మకి భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో..... కాబట్టి వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.
"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.
"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు. ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు." అన్నాడు బ్రహ్మ.
"పోనీ ... నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.
"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."
"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.
"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."
అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.
"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం....." అంది.
"భేష్.... మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.
అన్నిటినీ గెలుస్తాడు. కానీ తన లోపలికి వెళ్లలేడు.
తనను తాను గెలవలేడు. అక్కడే దాచేద్దాం," అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచీ బలం తన లోపలే ఉంది.
కానీ మనిషి బయట వెతుకుతూనే ఉన్నాడు.
So search For Your INNER POWER

0 comments :

Post a Comment