Be joyful..!!
Stay cheerful..!!!
"What Inspires Me" website maintained by Surathu Technologies, established in year 2012 to provide IT-enabled business solutions to small and medium enterprises. We do website designing and development as per client requirement and also make sure that we give our inputs at all possible stages of development.
Do you know the relation between two eyes…???
.
They never see each other
…
BUT
.
1. They blink together.
2. They move together.
.
3. They cry together.
4. They see together.
.
5. They sleep together.
They share a very deep bonded relationship… 😍
.
However, when they see a pretty woman, one will blink and
another will not… 😒
.
Moral of the story: A pretty woman can break any
relationship… 😜 😝 😂 👍
One day a school teacher wrote on the board the following:
9×1=7
9×2=18
9×3=27
9×4=36
9×5=45
9×6=54
9×7=63
9×8=72
9×9=81
9×10=90
When she was done, she looked to the students and they were all laughing at her, because of the first equation which was wrong, and then the teacher said the following,
"I wrote that first one wrong on purpose, because I wanted you to learn something important. This was for you to know how the world out there will treat you. You can see that I wrote RIGHT 9 times, but none of you congratulated me for it; you all laughed and criticized me because of one wrong thing I did. So this is the lesson...:
'The world will never appreciate the good you do a million times, but will criticize the one wrong thing you do...
But don't get discouraged, ALWAYS RISE ABOVE ALL THE LAUGHTER AND CRITICISM. STAY STRONG.' "
భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు...
.
భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.
.
భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది?
.
భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..
.
భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..
.
ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.
.
భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..
.
భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..
.
భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..
.
భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..
.
భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..
.
మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు.
.
ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది.
.
ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది.
.
నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు.
.
అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది..
.
విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు.
.
మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. "హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. .
.
రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు..
.
నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది.
.
ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు.
.
ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు..
.
ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన..
.
అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్
ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు.
.
రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది.
.
చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు..
.
తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని.
.
అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే....
.
జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు.
.
కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది .
.
అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు..
.
ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.
.
.
.
.
.
.
.
.
అప్పటికే ఆమె చనిపోయింది.
.
ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..
.
తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది.
.
మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు.
.
మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది.
.
మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి..
వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు..
.
చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను.
.
(మీరు ఈ కథని మరొకరికి పంపిస్తే, ఒక వివాహం బంధాన్ని కాపాడే అవకాశం ఉంది.)
ఓరోజు బుద్ధ భగవానుడు బిక్షాటన చేస్తూ ఓ ఇంటి ముందు నిలబడ్డారు,
ఆ ఇంటావిడ విస, విసా ఇంట్లోనుంచి బయటకు వచ్చి ఎదురుగా నిలబడి ఉన్న బుద్ధున్ని చూసి "దుక్కలా వున్నావు, ఏదైనా పనీ పాటా చేసుకుని ఛావచ్చుగా ఇలా అడుక్కోకపోతే.. నీవు సోమరిగా తయారవడమే కాకుండా నీ శిష్యులు అని చెప్పుకుంటున్న వీరిని కూడా సోమరులుగా తయారుచేస్తున్నావు,అని నానా తిట్లు తిట్టసాగింది..
బుద్ధ భగవానుడు చిరునవ్వుతో ఆమె తిట్టే తిట్లన్నింటినీ విన సాగారు,
ఆమె బుద్ధ భగవానున్ని తిట్టే తిట్లను విని శిష్యులు పట్టరాని కోపంతో ఊగిపోతున్నారు, బుద్ద భగవానుడు వారిని వారించారు..
తరువాత ప్రసన్నవదనం తో ఆమెతో మాతా! చిన్న సంశయం,అడగమంటావా ?
అందుకు ఆమె అడుక్కోవడం నీకు అలవాటే కదా, అడుక్కో, నీ సంశయం తీరుస్తాలే అంది.
అప్పుడు బుద్ధ భగవానుడు తన చేతిలోని బిక్షాపాత్రను చూపుతూ ..
తల్లీ! నేను నీకు ఓ వస్తువును నీకు ఇస్తే, నీవు ఆ వస్తువు ను తిరస్కరిస్తే ఆ వస్తువు ఎవరికి చెందుతుంది?
నేను తీసుకోకుండా తిరస్కరించాను కాబట్టి ఆ వస్తువు నీకే చెందుతుంది.. అంది ఆమె వేళాకోళంగా,
అయితే... తల్లీ!
"నేను నీ తిట్లను స్వీకరించడం లేదు "
.
.
.
ఈ సంఘటన తో బుధ్ధ భగవానుడు మనకు గోప్ప బోధను చేసారు..
అలా మనల్ని కించపరిచే వాళ్ళు, వేళాకోళం చేసేవారు మనచుట్టూ చాలామందే ఉంటారు, కోంతమంది బహిరంగంగా, మరి కోంతమంది చాటుగా మనల్ని విమర్శిస్తుంటారు, వాటిని మనం పట్టించుకోనంత కాలం నీదారి సుగమనమే..
ఎప్పుడైకే పట్టించుకుంటావో ఆ క్షణమే నీ పతనానికి పునాది రాయి పడ్డట్టు,
పదిమంది నీ గురించి విమర్శించుకుంటున్నారంటే నీ ఎదుగుదల మెుదలైనట్టే.
1.పసుపు
రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. 'లో డెన్సిటీ లిపొప్రొటైన్' (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
2.యాలకులు
తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.
3.మిరప
వీటిని (ఆహారంలో భాగంగా) తిన్నాక కేవలం 20 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. మిరపలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు.
4.కరివేపాకు
బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే.
5.వెల్లుల్లి
ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.
6.ఆలివ్ ఆయిల్
వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
7.క్యాబేజీ
బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు
8.పెసరపప్పు
కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు.
9.తేనె
మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.
10.మజ్జిగ
గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు దొరుకుతాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.
11.సజ్జలు
అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే ఇలాంటి ఉపయోగమే కలుగుతుంది.
12.చెక్కా లవంగాలు
ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రైకోగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి.
ఇవన్నీ మీ డైలీ మెనూలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు.
A 6 yr old boy was in the market with his 4 yr old sister........ Suddenly the boy found that his sister was lagging behind.
He stopped and looked back. His sister was standing in front of a toy shop and was watching something with great interest.
The boy went back to her and asked,"Do you want something ?" The sister pointed at the doll.
The boy held her hand and like a responsible elder brother, gave that doll to her.The sister was very very happy...
The shopkeeper was watching everything and getting amused to see the matured behaviour of the boy...
Now the boy came to the counter and asked the shopkeeper,
"What is the cost of this doll, Sir !"
The shopkeeper was a cool man and had experienced the odds of life. So he asked the boy with a lot of love n affection,"
Well, What can you pay ?"
The boy took out all the shells that he had collected from sea shore, from his pocket and gave them to the shopkeeper. The shopkeeper took the shells and started counting as if he were counting the currency. Then he looked at the boy.The boy asked him worriedly,"Is it less ?
" The shopkeeper said," No,No...
These are more than the cost. So I will return the remaining." Saying so,he kept only 4 shells with him and returned the remaining.
The boy, very happily kept those shells back in his pocket and went away with his sister...
A servant in that shop got very surprised watching all these. He asked his master," Sir ! You gave away such a costly doll just for 4 shells ???
"The shopkeeper said with a smile," Well, For us these are mere shells.
But for that boy, these shells are very precious. And at this age he does not understand what money is, but when he will grow up, he definitely will.
And when he would remember that he purchased a doll with the Shells instead of Money, he will remember Me and think that world is full of Good people.
It will help him develop a positive attitude and he too in turn will feel motivated to be Good !
Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.
Welcome to Surathu Technologies blog, I am Sreenivaas Surathu, founder of
Surathu Technologies
. I am passionate about internet, web technologies and I like traveling and love to make friends and its a great feeling when we have friends all around the world.
I started this blog to motivate myself towards my goal and What Inspires Me, can also Inspires You.
Stay Connected:
Copyright 2015 - What Inspires Me VeeThemes.com