ఒక వూళ్ళో చాలా కోతులుండెవి. ఒక రోజు ఒక బిజినెస్ మాన్ ఆ వూరికొచ్చికోతులను వంద చొప్పున కొంటానని ప్రకటించాడు.
అదివిన్న వూరువాళ్ళు " వీదిలో తిరిగే కోతుల్ని వంద చొప్పునెవడు కొంటాడు ..... ఆయనొక పిచ్చివాడు" అని నమ్మలేదు. కానీ ఒకరిద్దరు దాన్ని తేలికగా తీలుకోలేదు. వస్తే వంద లేకపోతే మనది పోయేదేమీలేదు అని ప్రయత్నించారు. వాళు వంద చొప్పున సంపాదించుకున్నారు.
ఆ వార్త వూరంతా గుప్పుమంది. అంతే అందరూ కోతులెనకపడ్డారు. ఖాలీ లేకుండా కోతుల్ని పట్టి వంద చొప్పున సంపాదించారు. కొన్ని రోజుల తరువాత ఆ బిజినెస్ మాన్ రెండొందలని ప్రకటించాడు. అంతే అటూ ఇటూ పరిగెత్తి మరీ మిగిలిన కోతుల్ని పట్టి అమ్మారు.
వూరిలో కోతులు దాదాపుగా అమ్మేసారు. అప్పుడు ఆ బిజినెస్స్ మాన్ ఐదు వందలని ప్రకటించాడు.
అంతే వూరి వాళ్ళకి నిద్రాహారాలు మర్చిపోయిమరీ కోతులకోసం గాలించి గాలించి మరీ పట్టుకుని అమ్మేసారు. ఇంకా వూళ్ళో బయట కోతులే లేవు.
ఆ సమయంలో బిజినెస్స్ మాన్ ఒక కోతి వెయ్యి రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు. కానీ ప్రకటించిన వెంటనే ఆయన అర్జంటుగా సొంతూరు వెళ్ళవలసిన పనిపడంది. బిజినెస్స్ అంతా ఒక్కడే చూసుకునేవాడు. కనుక
ఒక అసిస్టెంట్ నియమించి వూరికెళ్ళాడు.
ఇంకేటి వూరివాళ్ళి మంచి నీళ్ళుకూడా త్రాగ మర్చిపోయారు. అసలు వూళ్ళోకోతులే లేవు. మరి కోతికి వెయ్యి అంటె మంచి ఆఫర్ మిస్స్ అవుతున్నామన్న బెంగ పట్టుకుంది.
అది పసిగట్టిన అసిస్టెంట్ వూరివాళ్ళతో " ఇక్కడున్న కోతుల్ని నేను మీకు ఏడు వందల చొప్పున మీకు ఇస్తాను. వూరునుండి వచ్చే మా షావుకారుకి మీరు వెయ్యి చొప్పున అమ్మెయ్యండి. మీకు ఒక కోతికి మూడు వందలు లాభం. " అని లోపాయకారి వుపాయం చెప్పాడు.
ఆవార్త వూరంతా పొక్కింది. ఇంకేముంది మంచి బేరం దొరికింది అని ఆ అస్సిస్టెంట్ దగ్గర క్యూ కట్టారు. డబ్బున్నోళ్ళు కోతి మందల్ని కొనేసారు. పేదవాళ్లు పైనాంసియర్స్ దగ్గర అప్పు చేసి మరీ ఏడువందలిచ్చి మరీ కొన్నారు. అలా ఆ అస్సిస్టెంట్ తన దగ్గరున్న మొత్తం అన్ని కోతుల్నీ అమ్మేసాడు.
ఆ బిజినెస్స్ మాన్ ఎప్పుడొస్తాడో తెలీదు... కొన్ని రోజులకి వాడు వస్తాడన్న నమ్మకమూ పోయొంది. కానీ ఆశ చావక ఏడు వందలిపెట్టికొన్న ఆ కోతుల్ని వదల్లేక వాటిని కాపలా కాయలేక వాటిని మేపలేకా సతమత మౌతూ బ్రతికేస్తున్నారు.
ఇదే వ్యాపారమంటే ...దాన్నే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటున్నాం. ఈ వ్యాపారం ఎంతమందినో అప్పులపాలు చేసి రోడ్డునకీడ్చింది కొద్దిమందిని మాత్రమే కోటీశ్వరుల్ని చెసింది.
0 comments :
Post a Comment