Easy to Criticise but Difficult to Rectify | What Inspires Me

Easy to Criticise but Difficult to Rectify

No Comments

ఆర్య పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు. దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు. దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడునేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది. ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు. ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక "ఇంటూ" మార్కు పెట్టండి అని అందులో ఉంది.

దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు. అతడికి ఏడుపు వచ్చింది. దాని నిండా "ఇంటూలే" ఖాళీ లేదు. 

ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు. "నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది" అంటూ విచారించాడు. మాస్టారు అతడిని ఓదార్చారు. అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు. మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు. ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు. దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు. 

"నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది. ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు. ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో, బ్రష్ లతో దానిని సరి చెయ్యండి" అని ఆ నోటీసు లో ఉంది. 

వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు. 
ఎందుకలా జరిగింది ? ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక. సరి చెయ్యడం చాలా కష్టం.

Source: https://www.facebook.com/raghavanand.mudumba

0 comments :

Post a Comment