What Inspires Me

☁🌥⛅🌤☀🌞

పిల్లల పై అతిమోహం వద్దు ..
వారిని స్వశక్తితో ఎదిగేందుకు
సహకరిద్దాం ...
ప్రతీ తల్లిదండ్రులు చదవాల్సినది .

శూరసేనుడనే మహారాజు
చాలా గొప్పవాడు.
అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ
కన్నబిడ్డలా చూసుకునేవాడు.

ఇతని పరిపాలనలో రాజ్యం
చాలా సుభిక్షంగా ఉండేది.
ప్రజలు ఎవరి వృత్తులను వారు
సక్రమంగా చేసుకునేవారు.

అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓక కోరిక కలిగింది.
గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు.

తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకోని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు గూడు కట్టుకొని ఉండేవి. మరలా వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి.
ఇలా చాలారోజులు ప్రయత్నించాడు.
కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుక మాత్రం చూడలేకపోయేవాడు.

ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన
మనస్సులో కోరికను వెల్లడించాడు.
మంత్రి విని వెంటనే ఆ గొంగళి
పురుగులు ఉన్న చెట్టు దగ్గర
భటులను నియమించి
''సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని
మాకు తెలియజేయండి"
అని ఆదేశించాడు.
భటులు అలాగే అని గొంగళిపురుగులు ఉన్న
చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే
సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా,
హుటాహుటిన రాజుగారిని
వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు.
సరిగ్గా అదే సమయానికి గూడులో
నుండి సీతాకోక చిలుక బయటికి
రావడం మొదలైంది.

రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం
మొదలుపెట్టాడు.
గూడులో నుండి మెల్లమెల్లగా
బయటికి రావడం మహారాజు
చూసి,
అయ్యో! ఎంత కష్టపడుతుందో!
పాపం అనుకోని దగ్గరికి వెళ్లి
ఆ గూడుని తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా,
సీతకోకచిలుకకి ఏమి కాకుండా కోశాడు.
అది బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది.

అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది
అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు.
అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కాని రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు
దుఃఖించాడు.

మంత్రివర్యా!
ఏమిటి ఇలా జరిగింది.
ఎందుకలా చనిపోయింది? అని అడిగాడు.
అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు.

మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకుతానుగా
ఎదగడానికి ప్రయత్నించాలి.
అప్పుడే తన సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది.
ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు.
అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉంటుంది అనుకోకూడదు.
తనను మంచి మార్గంలో పెడుతున్నాడు.
శిక్షించకపోతేనే ప్రమాదం.
విచ్చలవిడితనం పెరుగుతుంది.
సర్వనాశనం అవుతాడు.
అలాగే ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి.
మీరు ఏదో సహాయం చేద్దాం అనుకున్నారు.
అది కష్టపడుతుంది అనుకుని మీరు సాయం చేయబోయారు. చివరికి చనిపోయింది.
ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు.
రాజు గారు మళ్ళి దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి,
మహారాజా!
ఎం జరుగుతుందో చూడండి అని అక్కడే నిలబెట్టేశాడు.

సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది.
అప్పుడు
మహారాజా! చూశారా!
ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన తన ఇంద్రియాలలో బలం పెరిగింది.
దానివలన దాని రెక్కలు పటిష్ఠమై ఎగరడానికి సహాయపడ్డాయి.
ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేసారు.
దానివలన సీతకోకచిలుకకి కష్టపడాల్సిన పనిలేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది.

అర్థమైందా మహారాజా! ప్రతిజీవికి పరమాత్మ
స్వయం శక్తిని ఇచ్చాడు.
దానిని ఎవరివారిని తెలుసుకోనివ్వాలి.

అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా నాశనం చేసినవారం అవుతాము. అని చెప్పగా మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులు ఇచ్చాడు.
దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకొంత పరిపాలనకు వాడుకున్నాడు.

ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు.

🌈SOMEONE HAS WRITTEN THESE 10 BEAUTIFUL LINES. READ and TRY to UNDERSTAND the DEEPER MEANING of THEM.
🌠 👼👼👼
 
🌷 1). PRAYER is not a "spare wheel" that YOU PULL OUT when IN trouble, but it is a "STEERING WHEEL" that DIRECT the RIGHT PATH THROUGHOUT LIFE.
👼👼👼

🌷🌷 2). Why is a CAR'S WINDSHIELD so LARGE & the REAR VIEW MIRROR so small? BECAUSE our PAST is NOT as IMPORTANT as OUR FUTURE. So, LOOK AHEAD and MOVE ON.
👼👼👼

🌷🌷🌷3). FRIENDSHIP is like a BOOK. It takes a FEW SECONDS to BURN, but it TAKES YEARS to WRITE.
👼👼👼

🌷🌷🌷🌷4). All THINGS in LIFE are TEMPORARY. If they are GOING WELL, ENJOY them, they WILL NOT LAST FOREVER. If they are going wrong, don't WORRY, THEY CAN'T LAST LONG EITHER. 👼👼👼

💐🌷5). Old FRIENDS are GOLD! NEW friends are DIAMONDS! If you GET a DIAMOND, DON'T FORGET the GOLD! To HOLD a DIAMOND, you ALWAYS NEED a BASE of GOLD!
👼👼👼

💐🌷🌷6). Often when WE LOSE HOPE and THINK this is the END, GOD SMILES from ABOVE and SAYS, "RELAX, SWEETHEART; it's JUST a BEND, NOT THE END!"
👼👼👼

💐🌷🌷🌷7). When GOD SOLVES your PROBLEMS, you HAVE FAITH in HIS ABILITIES; when GOD DOESN'T SOLVE YOUR PROBLEMS, HE has FAITH in YOUR ABILITIES.
👼👼👼

💐💐 8). A BLIND PERSON asked GOD: "CAN THERE be ANYTHING WORSE THAN LOSING EYE SIGHT?" HE REPLIED: "YES, LOSING YOUR VISION!"
👼👼👼

💐💐🌷 9). When YOU PRAY for OTHERS, GOD LISTEN to YOU and BLESSES THEM, and SOMETIMES, when you are SAFE and HAPPY, REMEMBER that SOMEONE has PRAYED for YOU. 
👼👼👼

💐💐🌷🌷 10). WORRYING does NOT TAKE AWAY TOMORROW'S TROUBLES; IT TAKES AWAY today's PEACE. 
👼👼👼

కుదిరితే పరిగెత్తు ,
లేకపోతే నడువు
అదీ చేతకాకపోతే
పాకుతూ పో,
అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని
అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే  
తలుచుకుంటే
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు,
పారే నది,
వీచే గాలి,
ఊగే చెట్టు,
ఉదయించే సూర్యుడు
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో.. ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...

నువ్వు పడుకునే పరుపు..
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్.. ,

నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,

నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..

మళ్ళీ చెప్తున్నా....!
కన్నీళ్ళు కారిస్తే కాదు...
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..!

చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే..
అస్త్రాలు...

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా* నేర్చుకుని చదవ వచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను. అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోష పరచడానికి ఆడతాను అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు రాజా! ఆట ను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలి గాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! అంటూ సున్నితంగాతిరస్కరించాడు.

సరే! పండితా! నీ తెలివి ని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! అన్నాడు రాజుగారు.

మహారాజా! చదరంగం లో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు - నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -
.... 61564 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం. అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే! అని ఆ పని మంత్రికిపురమాయించాడు.

ఆ పండితుని వెంటమంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు పండితుడడి గాడు కదా.. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు, తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు.. అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజ లకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..

అలా తీసెయ్యకండి మహారాజా!.. ఆ పండితు డేమీ వెర్రిబాగులవాడు కాదు..

ఎందుచేత..? అన్నాడు రాజుగారు.

లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!!!

ఎందుకు..? ఆశ్చర్య పోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటల కొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణం లో చెప్పేసాడు మహారాజా! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపక మాల పద్యం కూడా చెప్పాడు.

అలాగా.. ఏమిటా పద్యం..?

ఇదుగో.. వినండి మహారాజా !

శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు
నిజంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు దీన్లో తేలిన లెక్కెక్క డుంది..?అంతా బాణా లూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలుతప్ప..

అదే మహారాజా! మన దేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరము లతో అనల్పార్థ సాధకం గా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతా లుగా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ పద్యంలో

శర, సాయక, -  అనే పదాలకు అర్థం బాణాలు అని.( మన్మథుని పంచ సాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.

గగన, వియత్ - 0
(ఆకాశం గగనం శూన్యం)

శశి, చంద్ర, తుహినాంశు -1 (చంద్రుడొకడే భూమి కి )
షట్కము - 6
రంధ్ర - 9
(నవరంధ్రాలు)
నగ, గిరి, భూధర - 7
అగ్ని - 3
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని,దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
అబ్ధి, పయోనిధి - 4
వేద -4
(చతుర్వేదములు)
తర్క - 6
(షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
పద్మజాస్య - 4
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)
కుంజర - 8
(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెల సంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
సాయక రంధ్ర వియత్
5            9       0
నగాగ్ని భూ
    7       3
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
తర్క పయోనిధి
6         4
పద్మజాస్య కుం
    4     
జర తుహినాంశు
8         1
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

అంకెలులెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. "అంకానాం వామతో గతిః" - కుడి నుంచి ఎడమకు చేర్చి చదువు కోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
1,84,46,74,40,73,70,95,51,615

ఒకకోటి 84లక్షల 46 వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజ లు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.

పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సం.।।లు...

అదీ సంగతి…

వేదపండితులతో వేళా కోళం తగదు మహారాజా!… నిజానికి అతడు చదివిన ఘనపనస కూడా లెక్కలకు,ధారణ శక్తికి సంబంధించినదే! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచారు. ఇప్పుడు ఏం చేయడం? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది.

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు.

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నేఅడుగుదాము.అని ఆ పండితున్ని పిలిపించిక్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పుమన్నాడు.

ఆ పండితుడు రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యంబదులు గా అవును ఇవ్వండి చాలు! అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

A successful business man was growing old and knew it was time to choose a successor to take over the business.

Instead of choosing one of his Directors or his children, he decided to do something different. He called all the young executives in his company together.

He said, “It is time for me to step down and choose the next CEO. I have decided to choose one of you..”

The young executives were Shocked, but the boss continued. “I am going to give each one of you a SEED today – one very special SEED… I want you to plant the seed, water it, and come back here one year from today with what you have grown from the seed I have given you. I will then judge the plants that you bring, and the one I choose will be the next CEO.”

One man, named Jim, was there that day and he, like the others, received a seed. He went home and excitedly, told his wife the story. She helped him get a pot, soil and compost and he planted the seed. Everyday, he would water it and watch to see if it had grown. After about three weeks, some of the other executives began to talk about their seeds and the plants that were beginning to grow.

Jim kept checking his seed, but nothing ever grew.

Three weeks, four weeks, five weeks went by, still nothing.

By now, others were talking about their plants, but Jim didn’t have a plant and he felt like a failure.

Six months went by — still nothing in Jim’s pot. He just knew he had killed his seed. Everyone else had trees and tall plants, but he had nothing. Jim didn’t say anything to his colleagues, however.

He just kept watering and fertilizing the soil – He so wanted the seed to grow.

A year finally went by and all the young executives of the company brought their plants to the CEO for inspection.

Jim told his wife that he wasn’t going to take an empty pot. But she asked him to be honest about what happened. Jim felt sick to his stomach, it was going to be the most embarrassing moment of his life, but he knew his wife was right. He took his empty pot to the board room. When Jim arrived, he was amazed at the variety of plants grown by the other executives. They were beautiful — in all shapes and sizes. Jim put his empty pot on the floor and many of his colleagues laughed, a few felt sorry for him!

When the CEO arrived, he surveyed the room and greeted his young executives.

Jim just tried to hide in the back. “My, what great plants, trees, and flowers you have grown,” said the CEO. “Today one of you will be appointed the next CEO!”

All of a sudden, the CEO spotted Jim at the back of the room with his empty pot. He ordered the Financial Director to bring him to the front. Jim was terrified. He thought, “The CEO knows I’m a failure! Maybe he will have me fired!”

When Jim got to the front, the CEO asked him what had happened to his seed – Jim told him the story.

The CEO asked everyone to sit down except Jim. He looked at Jim, and then announced to the young executives, “Behold your next Chief Executive Officer!

His name is Jim!” Jim couldn’t believe it. Jim couldn’t even grow his seed.

“How could he be the new CEO?” the others said.

Then the CEO said, “One year ago today, I gave everyone in this room a seed. I told you to take the seed, plant it, water it, and bring it back to me today. But I gave you all boiled seeds; they were dead – it was not possible for them to grow.

All of you, except Jim, have brought me trees and plants and flowers. When you found that the seed would not grow, you substituted another seed for the one I gave you. Jim was the only one with the courage and honesty to bring me a pot with my seed in it. Therefore, he is the one who will be the new Chief Executive Officer!”

* If you plant honesty, you will reap trust
* If you plant goodness, you will reap friends
* If you plant humility, you will reap greatness
* If you plant perseverance, you will reap contentment
* If you plant consideration, you will reap perspective
* If you plant hard work, you will reap success
* If you plant forgiveness, you will reap reconciliation
* If you plant faith in God, you will reap a harvest

So, be careful what you plant now; it will determine what you will reap later.

Whatever You Give To Life, Life Gives You Back