October 2014 | What Inspires Me
In our earlier days, our elders used stories to teach moral lessons, below story is such a story, its in Telugu, the meaning of the story is "If we aim high and if we have a strong will power, then we can achieve that and we can get help from all side". Enjoy the story, if you don't know Telugu, use Google Translator https://translate.google.com/#te/en to convert Telugu into English, because its a great story.
సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. ఆ కధ ఏమంటే - అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు.
ఒక గబ్బిలం వుండేది. పై కప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలక్రిందులుగా వేలాడబడి వుంటుంది. ఎక్కువగా చీకట్లో, గుహల్లో వున్నట్లుగా వర్ణన వుంటుంది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇఖ వారు ఎవరి మాట వినలేదు.
ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం!
ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.
"ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. అందుకనే - భగవంతుడంటాడు - "ఓ బుద్దిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు! పదండి ముందుకు!!

A nice story to inspire, source: Brahmasri Chaganti Koteswara-rao సంకల్పం చేసుకోండి