Love like there's no tomorrow. And if tomorrow comes, well. Love again.
Love like there's no tomorrow. And if tomorrow comes, well. Love again.
Lessons from this picture:
1. Not all opportunities are to be taken. Some are traps.
2. A person can become so determined to destroy another person that they become blind and end up destroying themselves.
3. You fight best in your natural element and environment. Here the bird has advantage in his natural element.
4. Know your limits, we all have them.
5. Sometimes the best response to provocation is not to fight.
6. Sometimes to accomplish something you need teamwork, you will not always win alone.
7. Stick to what you do best and don't pursue what will kill you.
Your thoughts become your words,
Your words become your actions,
Your actions become your habits,
Your habits become your values,
Your values become your destiny.
- I shall fear only God.
- I shall not bear ill will toward anyone.
- I shall not submit to injustice from anyone.
- I shall conquer untruth by truth. And in resisting untruth, I shall put up with all suffering.
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.
పాండవులు శ్రీ కృష్ణుడుని ,కౌరవులు కర్ణుడుని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి.
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్దితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు.
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,బీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది,
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.
పాండవులకే కనుక కృష్ణుడు తన అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్లాన్(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.
1. The best doctors should carry his coffin ...
2. The wealth he has accumulated (money, gold, precious stones) should be scattered along the procession to the cemetery ...
3. His hands should be let loose, so they hang outside the coffin for all to see !!
One of his generals who was surprised by these unusual requests asked Alexander to explain .
Here is what Alexander the Great had to say :
1. "I want the best doctors to carry my coffin to demonstrate that in the face of death , even the best doctors in the world have no power to heal .."
2. "I want the road to be covered with my treasure so that everybody sees that material wealth acquired on earth , will stay on earth.."
3. I want my hands to swing in the wind, so that people understand that we come to this world empty handed and we leave this world empty handed after the most precious treasure of all is exhausted, and that is : TIME.
We do not take to our grave any material wealth. TIME is our most precious treasure because it is LIMITED. We can produce more wealth, but we cannot produce more time.
When we give someone our time, we actually give a portion of our life that we will never take back . Our time is our life !
The best present that you can give to your family and friends is your TIME.
నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి
1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.
2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.
3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని.
ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....
1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!
2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.
3. జీవితం చిన్నది.
ఒక రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.
4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన. కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది, కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్ని గమనించు.
ప్రేమ సౌందర్యాన్ని , అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో ( Damn crazy movies! )
5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.
6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.
7. నువ్వు నీ మాట నిలబెట్టుకో, ఇతరులనుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితో మంచిగా ఉండు, అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు.
8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.
9. అది ఎంతకాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!
అనగనగా దైవభక్తి మెండుగా గల ఒక మహారాజు గారికి, ఒకనాడు తన రాజ్యంలో వున్న ప్రజలకు, దైవభక్తి ఏ స్థాయిలో వున్నదో? తెలుసుకోవాలనే కోరిక కలిగిందట. వెంటనే మంత్రిని పిలిచి, తనకో మూడు సందేహాలున్నాయని, తన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి మంచి బహుమానం కూడా ప్రకటించమని ఆదేశిస్తారు.
వెంటనే మంత్రి గారు, రాజు గారి ప్రశ్నలను తెలుసుకుని, ఇలా ప్రశ్నలను నేరుగా అడిగితే, ప్రతి ఒక్కరూ మేము మేమంటూ, తమకు తోచిన సమాధానం చెప్పే అవకాశం వుంటుంది కాబట్టి, ఇలా కాదని చెప్పి, మంత్రిగారు చక్కని ఉపాయం పన్ని, తెలివిగా...
1. దేవుడు అనేవాడు అసలు వున్నాడా?
2. దేవుడు ఎటు చూస్తాడు' ?
3. ఇంతకూ ఆయన ఏం చేస్తుంటాడు?
అని ఈ మూడు ప్రశ్నలను చాటింపు వేయించి, సరియైన సమాధానం చెప్పని వారికి కఠినమైన దండన కూడా వుంటుందని మెలిక పెడతారు ఆ మంత్రవర్యులు.
ఈ దండోరా వలన 'రాజుగారి ౩ ప్రశ్నలు - గెలిస్తే రాజ్యం, ఓడితే ప్రాణం' విషయం ఆ రాజ్యంలోని పిన్నలు, పెద్దలు, పండితులు, భక్తులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరికీ చేరింది కానీ, శిక్షకు భయపడి ఎవరూ కూడా, రాజుగారి వద్దకు వచ్చి సమాధానం చెప్పడానికి సాహసం చేయలేకపోయారు.
చివరికి ఒక సాధువు మాత్రం అన్నింటికీ తెగించి, తాను రాజుగారి ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం ఇవ్వగలనని, ఒక వేళ తన సమాధానాలు సంతృప్తిని ఇవ్వకపోతే, తాను శిక్షను అనుభవించేందుకు సైతం సిద్ధమని అంటూ ముందుకు వచ్చాడు.
అంతా సమావేశమయ్యారు. రాజుగారు ఆ సాధువును ఒక మారు తీక్షణంగా చూడసాగారు. అప్పుడు సాధువు ఇలా అన్నారు, 'దైవీ విషయం' పై చర్చిస్తున్నాం కనుక దీపారాధన నిమిత్తం సామాగ్రిని, నైవేద్యం కొరకు పాలు కావాలని కోరుతాడు. మంత్రి వర్యులు అక్కడున్న సిబ్బందితో వెంటనే సాధువు కోరిన వస్తువులు సమకూర్చుతారు.
అన్నీ సిద్ధం అయ్యాక రాజుగారు ఆ సాధువుతో, మరి ఇక నా సందేహాలను నివృత్తి చేయగలరని కోరుతాడు.
వెంటనే ఆ సాధువు ఇలా అంటారు, 'అడిగే స్థితిలో నువ్వు వున్నావు, నీవు అడిగిన వాటికి బదులు చెప్పే స్థితిలో నేను వున్నాను, అంచేత నేను ఉన్నత ఆసనం మీద కూర్చోవటం ధర్మం. నీవు శిష్యస్థానంలో వున్నావు కనుక క్రింద కూర్చుంటే మంచిది అని సెలవిస్తాడు.
రాజుగారు క్షణకాలం కూడా ఆలోచించకుండా, సాధువు ఆంతర్యం గ్రహించి, సాధువుకి తన రాజాసనం ఇచ్చి, తాను అతని పాదాల వద్ద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చున్న సాధువు, రాజును ప్రశ్నించ మని అడుగుతాడు.
రాజు తన మొదటి ప్రశ్నగా ‘దేవుడున్నాడా’వుంటే ఎలా వున్నాడు? అని అడుగుతాడు.
అపుడా సాధువు ప్రక్కనే చెంబులో వున్న పాలను చూపించి, ఈ పాలలో వెన్న ఉన్నదా?’అని ఎదురు ప్రశ్న వేస్తాడు. రాజుగారు వెంటనే ఆ పాలల్లో వెన్నవున్నది మహాశయా, అని బదులు చెబుతాడు. అయితే చూపించు? అని అడుగుతాడు ఆ సాధువు. అప్పుడు రాజుగారు అయ్యా! 'ఈ పాలను తోడు వేసి, పెరుగుగా మారిన తరువాత, చిలికితే కానీ వెన్న రాదు' అని రాజు సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ‘దేవుడు వున్నాడు, పాలల్లో వెన్నమాదిరి అంతా తానై వున్నాడు, కానీ ఆ దైవం గురించి నిరంతర చింతన ఉన్నవాళ్ళకు మాత్రమే, దైవ దర్శనం కలుగుతుంది’అని సమాధానం చెప్తాడు. సాధువు ప్రశ్నకు సంతృప్తి చెందిన రాజుగారు, సంతోషం అండీ అంటూ........
తన రెండవ ప్రశ్న 'దేవుడు ఎటు చూస్తాడు' అని అడుగుతాడు,
అప్పుడా సాధువు వెంటనే బదులు ఇవ్వకుండా, ప్రక్కనే వెలుగుతున్న దీపం చూపించి, ‘ఈ దీపం ఎటు వైపు వెలుగునిస్తోంది ?’అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాజుగారు ఆ దీపం ‘అన్ని వైపులకూ’ అని బదులిస్తాడు. అప్పుడు సాధువు, 'దైవం కూడా అన్ని దిక్కులకు చూస్తుంటాడు' అని సమాధానం చెబుతాడు. సాధువు చెప్పిన సమాధానానికి తృప్తి పడిన రాజుగారు,...........
తన మూడవ ప్రశ్నగా 'ఇంతకూ అసలు దేవుడు ఏం చేస్తుంటాడు' అని అడుగుతాడు. అప్పుడా సాధువు, "రాజా! నువ్వు ఈ రాజ్యానికే అధిపతివి కానీ, నీవు ఇప్పుడు నేల మీద కూర్చొన్నావు. నేనేమో సన్యాసిని, నీ సింహాసంపై కూర్చున్నాను. ఇలా భగవంతుడు క్రింది వాడిని పైకి, పైవాడిని క్రిందికి, వారి వారి ప్రారబ్ధానుసారం మార్చుతుంటాడు.
ఆ రాజు తన మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించాయని సంతోస్తాడు. సాధువుకు తన రాజ్యాన్ని ధార పోస్తానంటాడు. రాజా! నేను సాధువుని నాకెందుకు ఈ రాజ్యం - నీవే చక్కగా ఎలుకోమని తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఆ రాజు తన యందలి భక్తి భావాన్ని మరింత వృద్ధిపొందించుకొని, అనన్యభక్తిని పొంది, ధన్యుయ్యాడు.
పాలల్లో వెన్నమాదిరి సృష్టి అంతా పరమాత్మ చైతన్యం నిండి వున్నది, దీపం వెలుగు అన్ని వైపులకు ప్రసరించినట్లుగా, ఈ సమస్త ప్రపంచానికి, విశ్వానికి, అంతరిక్షానికి… సర్వసాక్షిగా పరమాత్మ తత్వం నెలకొని వున్నది. జీవులకు వారివారి ప్రారబ్ధాన్నివ్వడమే ఈశ్వరుని పని.
☁🌥⛅🌤☀🌞
పిల్లల పై అతిమోహం వద్దు ..
వారిని స్వశక్తితో ఎదిగేందుకు
సహకరిద్దాం ...
ప్రతీ తల్లిదండ్రులు చదవాల్సినది .
✨
శూరసేనుడనే మహారాజు
చాలా గొప్పవాడు.
అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ
కన్నబిడ్డలా చూసుకునేవాడు.
✨
ఇతని పరిపాలనలో రాజ్యం
చాలా సుభిక్షంగా ఉండేది.
ప్రజలు ఎవరి వృత్తులను వారు
సక్రమంగా చేసుకునేవారు.
✨
అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓక కోరిక కలిగింది.
గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు.
✨
తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకోని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు గూడు కట్టుకొని ఉండేవి. మరలా వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి.
ఇలా చాలారోజులు ప్రయత్నించాడు.
కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుక మాత్రం చూడలేకపోయేవాడు.
✨
ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన
మనస్సులో కోరికను వెల్లడించాడు.
మంత్రి విని వెంటనే ఆ గొంగళి
పురుగులు ఉన్న చెట్టు దగ్గర
భటులను నియమించి
''సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని
మాకు తెలియజేయండి"
అని ఆదేశించాడు.
భటులు అలాగే అని గొంగళిపురుగులు ఉన్న
చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే
సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా,
హుటాహుటిన రాజుగారిని
వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు.
సరిగ్గా అదే సమయానికి గూడులో
నుండి సీతాకోక చిలుక బయటికి
రావడం మొదలైంది.
✨
రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం
మొదలుపెట్టాడు.
గూడులో నుండి మెల్లమెల్లగా
బయటికి రావడం మహారాజు
చూసి,
అయ్యో! ఎంత కష్టపడుతుందో!
పాపం అనుకోని దగ్గరికి వెళ్లి
ఆ గూడుని తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా,
సీతకోకచిలుకకి ఏమి కాకుండా కోశాడు.
అది బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది.
✨
అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది
అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు.
అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కాని రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు
దుఃఖించాడు.
✨
మంత్రివర్యా!
ఏమిటి ఇలా జరిగింది.
ఎందుకలా చనిపోయింది? అని అడిగాడు.
అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు.
✨
మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకుతానుగా
ఎదగడానికి ప్రయత్నించాలి.
అప్పుడే తన సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది.
ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు.
అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉంటుంది అనుకోకూడదు.
తనను మంచి మార్గంలో పెడుతున్నాడు.
శిక్షించకపోతేనే ప్రమాదం.
విచ్చలవిడితనం పెరుగుతుంది.
సర్వనాశనం అవుతాడు.
అలాగే ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి.
మీరు ఏదో సహాయం చేద్దాం అనుకున్నారు.
అది కష్టపడుతుంది అనుకుని మీరు సాయం చేయబోయారు. చివరికి చనిపోయింది.
ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు.
రాజు గారు మళ్ళి దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి,
మహారాజా!
ఎం జరుగుతుందో చూడండి అని అక్కడే నిలబెట్టేశాడు.
✨
సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది.
అప్పుడు
మహారాజా! చూశారా!
ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన తన ఇంద్రియాలలో బలం పెరిగింది.
దానివలన దాని రెక్కలు పటిష్ఠమై ఎగరడానికి సహాయపడ్డాయి.
ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేసారు.
దానివలన సీతకోకచిలుకకి కష్టపడాల్సిన పనిలేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది.
✨
అర్థమైందా మహారాజా! ప్రతిజీవికి పరమాత్మ
స్వయం శక్తిని ఇచ్చాడు.
దానిని ఎవరివారిని తెలుసుకోనివ్వాలి.
✨
అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా నాశనం చేసినవారం అవుతాము. అని చెప్పగా మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులు ఇచ్చాడు.
దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకొంత పరిపాలనకు వాడుకున్నాడు.
✨
ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు.
🌈SOMEONE HAS WRITTEN THESE 10 BEAUTIFUL LINES. READ and TRY to UNDERSTAND the DEEPER MEANING of THEM.
🌠 👼👼👼
🌷 1). PRAYER is not a "spare wheel" that YOU PULL OUT when IN trouble, but it is a "STEERING WHEEL" that DIRECT the RIGHT PATH THROUGHOUT LIFE.
👼👼👼
🌷🌷 2). Why is a CAR'S WINDSHIELD so LARGE & the REAR VIEW MIRROR so small? BECAUSE our PAST is NOT as IMPORTANT as OUR FUTURE. So, LOOK AHEAD and MOVE ON.
👼👼👼
🌷🌷🌷3). FRIENDSHIP is like a BOOK. It takes a FEW SECONDS to BURN, but it TAKES YEARS to WRITE.
👼👼👼
🌷🌷🌷🌷4). All THINGS in LIFE are TEMPORARY. If they are GOING WELL, ENJOY them, they WILL NOT LAST FOREVER. If they are going wrong, don't WORRY, THEY CAN'T LAST LONG EITHER. 👼👼👼
💐🌷5). Old FRIENDS are GOLD! NEW friends are DIAMONDS! If you GET a DIAMOND, DON'T FORGET the GOLD! To HOLD a DIAMOND, you ALWAYS NEED a BASE of GOLD!
👼👼👼
💐🌷🌷6). Often when WE LOSE HOPE and THINK this is the END, GOD SMILES from ABOVE and SAYS, "RELAX, SWEETHEART; it's JUST a BEND, NOT THE END!"
👼👼👼
💐🌷🌷🌷7). When GOD SOLVES your PROBLEMS, you HAVE FAITH in HIS ABILITIES; when GOD DOESN'T SOLVE YOUR PROBLEMS, HE has FAITH in YOUR ABILITIES.
👼👼👼
💐💐 8). A BLIND PERSON asked GOD: "CAN THERE be ANYTHING WORSE THAN LOSING EYE SIGHT?" HE REPLIED: "YES, LOSING YOUR VISION!"
👼👼👼
💐💐🌷 9). When YOU PRAY for OTHERS, GOD LISTEN to YOU and BLESSES THEM, and SOMETIMES, when you are SAFE and HAPPY, REMEMBER that SOMEONE has PRAYED for YOU.
👼👼👼
💐💐🌷🌷 10). WORRYING does NOT TAKE AWAY TOMORROW'S TROUBLES; IT TAKES AWAY today's PEACE.
👼👼👼
కుదిరితే పరిగెత్తు ,
లేకపోతే నడువు
అదీ చేతకాకపోతే
పాకుతూ పో,
అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని
అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప
దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే
తలుచుకుంటే
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు,
పారే నది,
వీచే గాలి,
ఊగే చెట్టు,
ఉదయించే సూర్యుడు
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా,
ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.
లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో.. ,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు..
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్.. ,
నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో... ,
నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్..
మళ్ళీ చెప్తున్నా....!
కన్నీళ్ళు కారిస్తే కాదు...
చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో..!
చదివితే ఇవి పదాలు మాత్రమే,
ఆచరిస్తే..
అస్త్రాలు...